telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం…

cm jagan

ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తూ… మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అదనంగా 234 వ్యాధులను ఆరోగ్య శ్రీ పథకంలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది… దీంతో.. మొత్తం 2,434 వ్యాధులను ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ వర్తించనుంది.. ఇక, మిగిలిన ఆరు జిల్లాల్లో ఆరోగ్య శ్రీ సేవలు విస్తరించారు.. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, నెల్లూరు, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయి ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపజేయనున్నారు. వచ్చే జనవరిలోగా 16 మెడికల్ కాలేజీలకు టెండర్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోనున్నారు.. టెండర్లు ప్రక్రియ వేగవంతానికి APMSIDC ఎండీ విజయ రామ రాజు, ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శ్రీ మిగిలిన 6 జిల్లాల వర్తింపు అమలును ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్.. మరోవైపు ఇవాళ కోవిడ్ బాధితులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీ సీఎం మాట్లాడనున్నారు. అయితే ఈ నిర్ణయంతో చాలా మంది పేద ప్రజలకు లబ్ది చేకూరుతుంది.

Related posts