telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సింహాచలం వెళ్ళే భక్తులకు క‌రోనా నిబంధ‌న‌లు ఇవే..

విశాఖ జిల్లా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకు వెళ్లే భక్తులకు క‌రోనా నిబంధనలు త‌ప్ప‌ని స‌రి చేశారు. నేటి నుంచి అంతరాలయం దర్శనాలు, తీర్థం, అన్నప్రసాదము ఉచిత ప్రసాదాల అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం భక్తుల సందర్శన సంఖ్యను తగ్గించారు.

అన్ని సేవా టికెట్లు 50 శాతానికి తగ్గిస్తున్నట్లు కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ముఖ్యంగా క్యూలైన్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.. గంగాధర స్నానాలు నిషేధించారు.. అంతేకాకుండా కనుమ రోజు జరగాల్సిన గ్రామ తిరువీధిని కూడా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం భక్తుల సందర్శన సంఖ్యను తగ్గించారు. అన్ని సేవా టికెట్లను 50% కి తగ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

కాగా..సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆలయాల్లో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలను సైతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడిస్తున్నారు.

Related posts