కింగ్ నాగార్జున ప్రస్తుతం కొత్త దర్శకుడు సోలోమెన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ లో అజయ్‌దేవ్‌గన్, ఇలియానా కాంబినేషన్లో వచ్చిన చిత్రం “రైడ్”. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. “రైడ్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట నాగ్. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్, గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమాలో హిందీ ‘రైడ్’ లో హీరోయిన్ గా నటించిన గోవా బ్యూటీ ఇలియానానే తీసుకోవాలని చూస్తున్నారట. రీమేక్ సినిమాతో హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు నాగార్జున. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
previous post
టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తానంటున్న రేవంత్ రెడ్డి…