ఈ నెల 22న మోదీ చెప్పినట్లు జనతా కర్ఫ్యూ పాటించాలని అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరోనాపై ప్రధాని మోదీ చేసిన సూచనలను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని జనసేన ఓ ప్రకటన విడుదల చేశారు. వాటిని ప్రజలందరూ పాటించాలని ఆయన కోరారు.
కరోనా మహమ్మారి ప్రమాదకరమని తెలిసినప్పటికీ సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కృషి చేద్దామని పవన్ పిలుపునిచ్చారు.