telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చినజీయర్ స్వామి ఆశ్రమంలో రోజా పూజలు

roja ycp mla

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా గుంటూరు సమీపంలోని సీతానగరంలో త్రిదండి చినజీయర్ స్వామిని కలిశారు. ఆశ్రమానికి వెళ్లిన రోజా స్వామివారిని కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రోజాను సత్కరించారు. అటు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కూడా చినజీయర్ స్వామిని కలిశారు.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు ఏపీ క్యాబినెట్ లో బెర్తు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల స్థానంలో కొత్త మంత్రులు వస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామి ఆశ్రమంలో పూజలు నిర్వహించారు.

Related posts