telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో వైసీపీ మాస్కుల కలకలం… ప్రచారం కోసమే…!

YCP

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతున్న తరుణంలో ఏపీలో వైసీపీ శ్రేణులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కరోనా.. ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు..(ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది) ఈ నేపథ్యంలో వైసీపీ వర్గాలు కొత్త ఆలోచన చేశాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించి తిరిగే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చాలా చోట్ల మాస్కుల కొరత కూడా నెలకొంది. ఇటు ఏపీలో కరోనా నియంత్రణ చర్యలు శరవేగంగా కొనసాగుతుంటే.. ఎన్నికల ప్రక్రియ కూడా ఇటీవల వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో కరోనా భయం లేకుండా ప్రచారం చేయాలని భావించారు కొంతమంది వైసీపీ నాయకులు. అందుకు వినూత్నంగా ఆలోచించి చేసిన ప్రయోగమే ఈ వైసీపీ మాస్కుల రూపకల్పన. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగి వుంటే.. కరోనా నేపథ్యంలో రిస్కు లేని ప్రచారం కోసం వైసీపీ రంగులు, వైసీపీ ఎన్నికల గుర్తు…వైసీపీ అధినేత జగన్ ఫోటో కలిపి.. కరోనా మాస్కులను రూపొందించారు. వాటిని పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వాడుకుందామనుకున్నారు. కానీ ఇపుడు పరిస్థితి మారిపోయింది. ఎన్నికల కమిషనర్ నిర్ణయం పుణ్యమాని.. ఆరు వారాల పాటు ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మాస్కుల ప్రయోగం ప్రస్తుతానికి వాయిదా పడినట్లే భావించాలి.

Related posts