telugu navyamedia
రాజకీయ

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం..ఓ వైపు హృదయ విదారక దృశ్యాలు

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. క్షిపణులు, ఫైటర్ జెట్స్, రాకెట్ లాంచర్స్‌తో ముప్పేట దాడి చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్ ద్వీపంలో 13 మంది సైనికులను పొట్టన పెట్టుకుంది రష్యా.  లొంగిపోవడానికి నిరాకరించిన 13 మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా యుద్ధ నౌకలో చంపేశారు. 

The emotional video where a man says goodbye to his family in Ukraine -  Then24

అయితే.. ఓ వైపు బాంబుల మోతతో జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు.కొన్నిచొట్ల పిల్లలను చంకనెత్తుకొని పెద్దవాళ్లను పట్టుకొని వీలైన చోట్లకు జనం పారిపోతూ కనిపించారు.  

ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో ఓ తండ్రి తన కూతురు, భార్యను సురక్షిత ప్రాంతానికి పంపిస్తూ భావోద్వేగానికి లోనైన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కూతురిని గుండెకు హత్తుకొని కన్నుల నిండా బాధ, ప్రేమతో ఎంతో ఉద్వేగానికి లోనవుతున్న తండ్రి బాధ అంద‌రిని క‌లిచివేస్తుంది.. ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

A Ukrainian father says goodbye to his family, - One News Page VIDEO

కూతురు బస్సు ఎక్కి వెళ్లిపోతుంటే కూడా తన చేతులను బస్సు అద్దంపై పెట్టి తండ్రి కంటతడి పెట్టుకోవడం చూడొచ్చు. తండ్రి కంటతడి పెట్టడం చూసిన కూతురు, పక్కనే ఉన్న భార్య‌ కూడా వెంటనే ఏడవటం ప్రారంభించారు. అయితే ఈ దృశ్యాలు ఎక్కడ జరిగాయనే విషయంపై క్లారిటీ లేదు..

Related posts