తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ర్ ఓ ట్విట్టర్ పోస్టుపై తీవ్రంగా స్పందించారు. ఓ వీరాభిమాని వీపుపై తన చిత్రాన్ని పచ్చబొట్టు పొడిపించుకోవడం పట్ల ఇది నిజమే అయితే ఇలాంటివి తాను అస్సలు ఇష్టపడనని స్పష్టం చేశారు.
రవికిరణ్ అనే అభిమాని వీపుపై పచ్చబొట్టు పొడిపించుకున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేయగా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సారీ బ్రదర్, ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించను అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏదేమైనా ఇటువంటి చర్య అనారోగ్యకరమని, కలవరపాటుకు గురిచేస్తోందని వ్యాఖ్యానించారు.