చెన్నైలో పాపులర్ టీవీ యాంకర్ ఇంట్లో కుక్కర్ పేలింది. తమిళనాట టెలివిజన్‌లో సూపర్ హిట్స్ అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేయడంతో మణిమేఘలై ఫేమస్ అయింది. తాజాగా మణిమేఘలై ఇంట్లో వంట చేసే వ్యక్తి రాకపోవడంతో కుక్కర్లో మణిమేఘలై స్వయంపాకం మొదలుపెట్టింది. తన ప్రయోగం ఎలా ఉంటుందో కాసేపట్లో రుచి చూద్దామనుకుంటుండగా ఇంతలో కుక్కర్ విజిల్ రాకుండా పేలిపోయింది. సడెన్‌గా పెద్ద శబ్ధం రావడంతో మణిమేఘలై ఉలిక్కిపడింది. ఆ ధాటికి వస్తువులన్నీ చెల్లాచెదురుకావడంతో వంట గది నాశనమైంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియో మణిమేఘలై తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కుక్కర్ సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని తెలిపింది మణిమేఘలై. సన్ మ్యూజిక్, విజయ్ టీవీ వంటి చానల్స్‌లో ఆమె పలు కార్యక్రమాలు చేసింది. 2017లో యాక్టింగ్ ట్రైనర్ హుసైన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొద్దికాలంగా ఈ జంట అన్నానగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు.
previous post