తమిళ హీరో ధనుష్, సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇద్దరు కలిసి ఓ లేఖను విడివిడిగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు.
“18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి.
ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. వ్యక్తిగతంగా సమయం వెచ్చించాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం” అని ధనుష్ ట్విటర్‌లో ఉంచిన లేఖలో పేర్కొన్నాడు.
మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా ఇదే పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఆమె క్యాప్షన్‌లో ఇలా రాసింది, “క్యాప్షన్ అవసరం లేదు…మీ మా నిర్ణయాన్ని అర్ధం చేసుకోవడం..మీ ప్రేమ అవసరం మాత్రమే!” అంటూ పేర్కొంది.
కాగా..వీరిద్దరూ 2004లో పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్ల దాంపత్య బంధానికి గుర్తుగా యాత్ర రాజా, లింగ ధనుష్ మగ పిల్లలు కూడా ఉన్నారు. వీరి ప్రకటనతో అభిమానులను నివ్వెరపోయేలా చేశారు.
“ప్రధాని నరేంద్ర మోడీ మీదనే పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ “మా”.. లో .. ఇలా ..?” -శివాజీ