telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వైఫై కనెక్షన్‌ను పక్కింటి వాళ్లకు ఇస్తున్నారా… అయితే ఇది చదవాల్సిందే…!

wi-fi

ఆసియాకు చెందిన వ్యక్తి తన ఇంట్లో వైఫై కనెక్షన్‌ను పక్కింటి వాళ్లకు ఇచ్చి వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ వస్తున్నాడు. బూస్టర్‌ను ఇన్‌స్టాల్ చేసి వైఫైను వేరొకరికి షేర్ చేయడం సర్వీస్ ప్రొవైడర్ కంట పడింది. యూఏఈ చట్టం ప్రకారం ఇలాంటి పనులకు పాల్పడటం నేరం. దీంతో సర్వీస్ ప్రొవైడర్ వెంటనే ఈ విషయాన్ని అధికారుల వద్దకు తీసుకెళ్లాడు. ఈ కేసు మొదట పబ్లిక్ ప్రాసెక్యూషన్‌కు.. అక్కడి నుంచి కోర్టుకు వెళ్లింది. నిందితుడు నేరం చేసినట్టు అంగీకరించడంతో జడ్జి నిందితుడిని మందలించి 50 వేల దిర్హామ్‌ల(రూ. 9 లక్షల 69 వేలు) జరిమానాను విధించారు.

Related posts