మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం గతంలో స్కూలు పిల్లలు హుండీలు ఏర్పాటు చేస్తే భువనేశ్వరి కానీ, ఆమె కోడలు కానీ ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు రాజధాని రైతుల కోసం అంటూ రెండు గాజలు ఇస్తే ఎలా నమ్ముతారని ప్రశించారు.
చంద్రబాబు చేతిలో భువనేశ్వరి రాజకీయ పావుగా మారారని ఆరోపించారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు భువనేశ్వరి ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు. నాడు తన తండ్రిపై భర్తే చెప్పులు వేయిస్తుంటే భువనేశ్వరి ఎందుకు బయటికి రాలేదని నిలదీశారు. పదవిని కోల్పోయి అసెంబ్లీ నుంచి కంటతడి పెట్టుకుంటూ ఎన్టీఆర్ వెళుతుంటే భువనేశ్వరి ఎందుకు తండ్రిని పరామర్శించలేదని ఆమె ప్రశ్నించింది.


వైసీపీ నేతలు బిల్డర్లపై “జే-ట్యాక్స్”.. నారా లోకేష్ విమర్శలు