telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దమ్ముంటే ఈడీతో నన్ను అరెస్ట్ చేయించండి- టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్

చీకోటి ప్రవీణ్ వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ నేతలకు దమ్ముంటే  ఈడీతో తనను అరెస్ట్ చేయించాలని ఆయన సవాల్ విసిరారు.

చికోటి వ్యవహారాన్ని తమపై ఆపాదించడం సరికాదన్నారు. గుడివాడలో కెసీనో అంటూ వచ్చిన.. టీటీపీ నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఈడీకి ఇవ్వాలని నాని డిమాండ్ చేశారు. దేశంలో ఏం జరిగినా జగన్‌కు ముడిపెడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు.

ఇకపోతే.. క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్‌ కుమార్‌‌కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డి తదితర ఏజెంట్లపై ఈడీ ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు కూడా సేకరించింది.

ఫెమా ను ఉల్లంఘనలపై దృష్టి సారించిన ఈడీ.. హవాలా లావాదేవీలకు సంబంధించి విచారణ సాగిస్తుంది. అయితే క్యాసినో వెనకాల చికోటి ప్రవీణ్ పెద్ద దందానే సాగించినట్టుగా తెలుస్తోంది.

Related posts