ఏపీ రాజధాని కోసం భూములు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2019-20 సంవత్సరానికి గానూ కౌలు కింద రూ. 187.44 కోట్లు నిధులు విడుదల చేసింది. తమ కౌలు డబ్బులు చెల్లించాలంటూ ఆందోళన చేస్తున్న రాజధాని రైతులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది.
కౌలు చెల్లింపు కోసం ఏర్పాట్లు చేయాలంటూ సీఆర్డీయే, పురపాలక శాఖలకు స్పష్టం చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు రూపేణా జూన్ మొదటి వారంలో వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేది. అయితే, ఆగస్టు ముగస్తున్నా కౌలు డబ్బులు విడుదల కాకపోవడంతో రైతులు కొన్నిరోజులుగా ఆందోళన బాటపట్టారు.