telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గత పాలకులు ఆప్కోను లంచాల మయం చేశారు.: సీఎం జగన్

ys jagan cm

గత పాలకులు ఆప్కోను లంచాల మయం చేశారని ఏపీ ఏపీ సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విభేదాలు చూపకుండా అన్నివర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని అన్నారు.

గతం ప్రభుత్వ హయాంలో సబ్సిడీ రాక చేనేతలు అవస్థలు పడ్డారు. అప్పుల పాలై వారు ఆత్మహత్యలు చేసుకుంటుంటే గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా మన చేనేత పరిశ్రమకు గుర్తింపు ఉన్నా ఇక్కడి నేతన్నల బాధలను పట్టించుకునే వారే అప్పట్లో లేరు. గత పాలకులు నేతన్నలను పట్టించుకోలేదు’ అని జగన్ అన్నారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. బీసీలంటే సమాజానికి వెన్నుముక లాంటి కులాలు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నవరత్నాలు అమలు చేస్తున్నామన్నారు. గతంలో ధర్మవరంలోనే నిరాహార దీక్ష చేశాను. ధర్మవరం చేనేతల పరిస్థితి నాకు తెలుసు. జనవరి 9 నాటికి అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ.15 వేలు సాయం అందిస్తామని తెలిపారు.

Related posts