జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి కన్నబాబు విమర్శలు గుప్పించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక కొరతపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు తప్ప మరో నాయకుడు పవన్ కు కనపడడంలేదని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా జగన్ నే టార్గెట్ చేసి మాట్లాడడమేంటని ప్రశ్నించారు.
తన రాజకీయ జీవితంలో ఎలాంటి దాపరికం లేదని, చిరంజీవి గారి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ వ్యాఖ్యల పై స్పందిస్తూ పవన్ కల్యాణ్ ఏనాడైనా చిరంజీవి గారి పేరు చెప్పారా? అని నిలదీశారు. కాగా, నిన్న విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ, కన్నబాబు బతుకు తమకు తెలియంది కాదని, కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చింది తామేనని అన్నారని విమర్శించారు.


టన్ను ఇసుక ధర రూ.370 అని చెప్పి.. రూ.900 వసూలు : పవన్ కల్యాణ్