telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సూపర్ మచ్చి” అంటున్న మెగాస్టార్ అల్లుడు

Super-Machi

మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ “విజేత” సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన విషయం సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంతో కళ్యాణ్ ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ప్ర‌స్తుతం రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో క‌ళ్యాణ్ త‌న రెండో సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాని పులి వాసు తెర‌కెక్కిస్తున్నాడు. రియా చ‌క్ర‌వ‌ర్తి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంతో వాసు ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్బంగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. “సూప‌ర్ మ‌చ్చి” అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేయ‌గా, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో క‌ళ్యాణ్ దేవ్ స‌రికొత్త ఉత్సాహంతో క‌నిపిస్తున్నాడు. బ‌న్నీ న‌టించిన స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి చిత్రంలో సూప‌ర్ మ‌చ్చి అనే సాంగ్‌కి ఎంత రెస్పాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఆ సాంగ్‌లోని లిరిక్‌ని మెగా అల్లుడు చిత్ర టైటిల్‌గా పెట్ట‌డం విశేషం. వ‌చ్చే ఏడాది సూప‌ర్ మ‌చ్చి చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related posts