telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ లో ఆఖరి పోరు .. ఆతిధ్యజట్టు-భారత్ మధ్యే .. : డూప్లెసిస్‌

duplesin on world cup final teams

ప్రపంచకప్‌ ఆఖరి పోరులో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడతాయని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫాఫ్‌ డూప్లెసిస్‌ జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డూప్లెసిస్‌ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాపై గెలుపు తమకన్నా ఎక్కువగా భారత్‌ సంతోషిస్తుందన్నాడు. భారత్‌-ఇంగ్లండ్‌ జట్లే ఫైనల్లో తలపడుతాయని, కీలక మ్యాచ్‌లను ఆసీస్‌, భారత్‌లు అద్భుతంగా ఆడుతాయన్నాడు.

వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్‌కు పెద్ద కష్టమైన పనేం కాదని అభిప్రాయపడ్డాడు. అలాగే ఆస్ట్రేలియాను ఇంగ్లండ్‌ ఓడిస్తుందని తెలిపాడు. ఇక ఆసీస్‌ ఓటమితో భారత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌ సెమీస్‌ ప్రత్యర్థిగా న్యూజిలాండ్‌ ఖరారు కాగా.. ఆసీస్‌.. ఇంగ్లండ్‌తో ఆడనుంది. క్రికెట్‌ డైహార్డ్‌ ఫ్యాన్‌, గూగుల్‌ సీఈవో సుంధర్‌ పిచాయ్‌ సైతం ఫైనల్లో తలపడేవి భారత్‌- ఇంగ్లండేనని తెలిపారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు కూడా బలమైన జట్లేనని, కానీ వీటితో జరిగే పోరులో ఇంగ్లండ్‌, భారత్‌లే పైచేయి సాధిస్తాయని పేర్కొన్నారు.

Related posts