తెలంగాణలో విద్యుత్ శాఖలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆయా కేటగిరీల్లో మొత్తం 3,025 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అక్టోబరు 10న విడుదల కానుంది. అక్టోబరు 10 నుంచే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది. మొత్తం ఖాళీల్లో జూనియర్ లైన్ మెన్ పోస్టులు 2500, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు 25, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 500 ఉన్నాయి. త్వరలో ఈ పోస్టుల నియామకాలు జరగనున్నాయి.
previous post
next post
రాత్రికి రాత్రి సర్దుకుని వచ్చింది తమరే కదా చంద్రం సారూ: విజయసాయిరెడ్డి