ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరు పోలీసులు అడ్డుకున్నారు. ఈ రోజు ఉదయం గురజాలలో తలపెట్టిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఆయనను మార్గమధ్యలో పోలీసులుఅడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ నాయకుడిని అడ్డుకోవడంపై బీజేపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడి పరిస్థితులపై తన ట్విట్టర్ ఖాతాలో కన్నా స్పందించారు.
రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం బతికుందా? అని ప్రశ్నించారు. తనను అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. “ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా? పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడితే పోలీసులు అక్రమ అరెస్ట్లు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధిని వెనక్కి పరిగెత్తించి, కక్షసాధింపు రాజకీయాలే ప్రధాన అజెండా” అని ఆరోపించారు.