telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

తృణమూల్, బీజేపీ మధ్య ఘర్షణ.. ముగ్గురు కార్యకర్తలు మృతి

పశ్చిమబెంగాల్‌లో తృణమూల్, బీజేపీ నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం తృణమూల్ కార్యకర్తను కొందరు హతమార్చారు. తాజాగా పరగాణాల జిల్లాలో నిన్న రాత్రి తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో ఒకరు తృణమూల్‌కు చెందిన వ్యక్తి కాగా మరో ఇద్దరు బీజేపీకి చెందినవారు.

బహిరంగ ప్రదేశాల్లో పార్టీ జెండాలను తొలగించిన విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

 

Related posts