డ్రగ్స్‌ను ఒకచోట నుంచి మరోచోటకు అక్రమంగా తరలించేవారు వినూత్న పద్దతులను పాటిస్తూ పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతుంటారు. తాజాగా ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా పిరుదులలో డ్రగ్స్ తరలిస్తూ అధికారులకు చిక్కాడు. మెక్కే అనే వ్యక్తిని తనిఖీ చేసిన అధికారులకు మొదట ఎటువంటి డ్రగ్స్ దొరకలేదు. అయితే మెక్కే ముఖం నీరసంగా ఉండటం, అదేవిధంగా తన నుంచి మత్తు పదార్థాల వాసన వస్తుండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతని బట్టలు మొత్తం విప్పి క్షణ్ణంగా పరిశీలించగా… మెక్కే తన పిరుదులలో 11 చిన్న సైజు బ్యాగులను దాచాడు. వాటిలో వివిధ రకాల డ్రగ్స్, ఇతర మందులు ఉన్నాయి. అధికారులు వెంటనే మెక్కేను అదుపులోకి తీసుకున్నారు. అతని గురించి దర్యాప్తు చేయగా.. 2008లో మెక్కేపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల ఓ వ్యక్తి డ్రగ్స్‌ను వేరశెనగ గింజలలో దాచి అక్రమంగా తీసుకెళ్తూ దుబాయ్ పోలీసులకు దొరికిపోయాడు. మరో యువతి వాల్నట్లలో సరఫరా చేస్తూ దొరికిపోయింది.
previous post
తప్పుడు హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారు: కాకాణి