telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానంలో మహిళపై అమానుషం… 2 గంటలపాటు టాయిలెట్ కు వెళ్ళనీయకుండా…!

PLane

గత నెలలో డబ్లిన్‌ వెళ్లేందుకు ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళ (25) కొలంబియా ఎయిర్‌పోర్టులో ఎయిర్ కెనడా విమానం ఎక్కింది. అయితే, సాంకేతిక లోపం కారణంగా ఆ ఫ్లైట్ రెండు గంటల పాటు విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. ఈ క్రమంలో విమానంలో ఉన్న ఆ మహిళ మూత్ర విసర్జన కోసం బాత్రూంకు వెళ్లింది. అయితే అక్కడే ఉన్న విమాన సిబ్బంది ఆమెను టాయిలెట్‌లోకి అనుమతించలేదు. తనకు ఇబ్బందిగా ఉందని, మూత్రవిజర్జనకు వెళ్లాలని చెప్పిన వినలేదు. రెండు గంటలపాటు ప్రయాణికురాలు తీవ్రమైన ఇబ్బందితో అలాగే ఉండిపోయింది. టాయిలెట్‌లోకి వెళ్లేందుకు వెళ్లిన ప్రతిసారి ఆమెను సిబ్బంది అడ్డుకున్నారు. చివరకు ఆమె తాను కూర్చున సీటులోనే మూత్ర విసర్జన చేసేసింది. అయినప్పటికీ సిబ్బంది కనికరం చూపలేదు. ఆమెను అదే సిటులో కూర్చొబెట్టి ఏడు గంటలు ప్రయాణం చేయించారు. సిబ్బంది చర్యపట్ల తీవ్ర మనస్థాపానికి గురైన ప్రయాణికురాలు విమానాశ్రయంతో దిగిన తర్వాత ఫ్లైట్ సిబ్బందిపై అధికారులకు ఫిర్యాదు చేసింది. తనపట్ల విమాన సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

Related posts