పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు ముస్తాబయింది. తాజాగా ఈ చిత్రం నుంచి “బోనాలు…” లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. బోనాల పండుగ నేపథ్యంలో సాగుతున్న ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని దర్శకుడు పూరి జగన్నాథ్, రామ్ నమ్మకంగా ఉన్నారు.
previous post
మొటిమలు, స్కిన్ సమస్యలు అందరికీ వస్తాయి… : రితికా సింగ్