telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వైభవంగా జరిగిన నోయెల్ పెళ్ళి

Singer-Noel-Wedding

గాయకుడు, నటుడు నోయెల్, హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా ను వివాహమాడాడు. క్రిస్టియన్ పద్ధతిలో ఈ ప్రేమ జంట పెళ్ళి ఘనంగా జరిగింది. నోయెల్ సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. “మేమిద్దరం వేరు కాదు ఒక్కటే… తను నా మహారాణి” అని నోయెల్ ట్వీట్ చేశాడు. మంగళూరులో జరిగిన ఈ పెళ్లి వేడుకకు దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి, పలువురు సినీ ప్రముఖులు, గాయనీ గాయకులు హాజరయ్యారు.

కుమారి 21ఎఫ్, ఈగ సినిమాలతో నోయెల్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎస్తేర్ విషయానికొస్తే… ఈ అమ్మాయి మంగళూరుకు చెందినది. తేజ దర్శకత్వంలో రూపొందిన “1000 అబద్ధాలు” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా సక్సెస్ ను అందుకోలేకపోయింది.

Related posts