చంద్రబాబు నిర్మించారన్న కారణంతోనే ప్రజావేదికను కూలగొట్టడం సరికాదని మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియ అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్రమకట్టడాన్ని కూలగొడితే తాము కూడా హర్షిస్తామని చెప్పారు. చంద్రబాబునాయుడు నివాసం పరిసరాల్లో అనాథాశ్రమాలు, ఆసుపత్రులు ఉన్నాయని వాటిని కూడా కూల్చివేస్తారా? అంటూ ఆమె ప్రశ్నించారు.
అవినీతి రహితపాలన అందిస్తామని జగన్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అధికారులెవరూ సీఎం మాటలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. అందుకే, ఇక నుంచి సీఎం జగన్ కు ప్రతిరోజు ఓ లేఖ రాస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చిన్న అవినీతి జరిగినా నేరుగా జగన్ కే లిఖితపూర్వకంగా తెలియజేస్తాననీ ఆమె పేర్కొన్నారు.

