ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూసుకుపోతుంది. వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం అవడంతో వైఎస్ జగన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అభ్యర్థులు అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీతో ముందున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈనెల 30న వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లుపార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు.