telugu navyamedia
రాజకీయ వార్తలు

‘జై శ్రీరాం’ నినాదాల పై మండిపడ్డ మమత

BJP compliant EC West Bengal

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అనూహ్య సంఘటన ఎదురైంది. వెస్ట్ మిడ్నాపూర్‌లో కొందరు ఆమెను చూసి ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం మమత ఓ బహిరంగ సభలో ప్రసంగించేందుకు చంద్రకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ జెండాలు పట్టుకుని రోడ్డుకిరువైపులా నిలబడిన కొందరు గ్రామస్తులు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని చూడగానే జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు.

దీంతో ఆగ్రహించిన మమత వెంటనే తన డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి ఒక్కసారిగా డోర్ తీసి కిందికి దిగారు. వెంటనే బీజేపీ కార్యకర్తలు ఆమెను చూసి పారిపోయారు. దీంతో మమత అనంతరం అక్కడి నుంచి సభాస్థలికి బయల్దేరి వెళ్లారు. అనంతరం ర్యాలీలో మాట్లాడుతూ నినాదాలు చేస్తున్న వాళ్లంతా మే 23 ఎన్నికల ఫలితాలు చూసి బాధపడాల్సి వస్తుందన్నారు. ఎన్నికల తర్వాత కూడా వారు ఈ రాష్ట్రంలోనే ఉంటారని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. బెంగాల్లో విభజన రాజకీయాలు చేస్తూ, ఘర్షణలు ప్రేరేపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మమత ఆరోపించారు.

Related posts