సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.
ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్‌తో పరిస్థితి మారిందని తెలిపారు. ఏడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని కొనియాడారు.
సరికొత్త ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమని నొక్కిచెప్పారు. వికసిత్ భారత్‌తో 2047 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని వ్యాఖ్యానించారు.
ఏపీలో 2026 జనవరి నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం హర్షణీయమని అన్నారు. దుబాయ్‌ను చూస్తుంటే తనకు అసూయ వేస్తోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
దుబాయ్‌లో ఎడారి ప్రాంతాలు, బీచ్‌లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
యూఏఈ జనాభాలో 40 శాతం మంది భారతీయులే ఉన్నారని ఉద్ఘాటించారు. 1991లో ఆర్థిక సంస్కరణలు,.. 1995లో టెక్నాలజీ రివల్యూషన్‌తో పరిస్థితి మారిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ(బుధవారం జులై 23) విజయవాడలో సమ్మిట్ నిర్వహించారు.
యూఏఈ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సదస్సు జరిగింది. భారత్-యూఏఈ ఆర్థిక సంబంధాలు బలోపేతంపై చర్చించారు. పెట్టుబడులకు ముఖద్వారంగా ఏపీ అనే అంశంపై మొదట మాట్లాడారు.
ఈ సమావేశంలో ఇన్వెస్టోపియా సీఈఓ డాక్టర్ జీన్ ఫేర్స్, సీఐఐ వైస్ ప్రెసిడెంట్, భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ సుచిత్ర కె.ఎల్ల, పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
‘నేను జనవరిలో అబ్దులా బిన్ను కలిశాను.. అప్పడు ముందు ఏపీకి రావాలని కోరాను. ఏపీ గురించి మీకు అప్పుడే అర్ధం అవుతుందని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఆయన ముందు ఆంధ్రప్రదేశ్‌కే వచ్చారు.
యూఏఈని ఓ దేశంగా చూస్తే ప్రతి దేశానికి కొన్ని అడ్వంటేజ్ ఉంటుంది. దుబాయ్ ప్రాంతంలో 50 డిగ్రీల టెంపరేచర్, ఎడారి ఉన్నా ఆ ప్రాంతాన్ని వారు స్వర్గంలా మార్చారు.
అక్కడి అభివృద్ది చూసిన నేను వారు ఇంటర్నెట్ సిటీ పెడితే నేను హైటెక్ సిటీ పెట్టాను. 2021లో మనం కరోనా వల్ల బయపడ్డాం.. ఆసమయంలో యూఏఈ ఇస్టోపియాను తీసుకువచ్చారు.
డిఫరెంట్‌గా ఆలోచిస్తే మనం ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం. 1.1కోట్ల మంది యూఏఈ జనాభాలో 40శాతం మంది ఇండియన్స్.వారి ద్వారా కూడా యూఏఈలో అభివృద్ధి జరుగుతుంది.
మనకు అక్కడ అవకాశాలు వస్తన్నాయి. ఇండియాను ఎవ్వరూ వ్యాపార పరంగా విస్మరించలేరు. డెమెగ్రఫిక్ డివిడెంట్ కేవలం ఇండియాకు మాత్రమే ఉంది.
చాలా దేశాలు ఏజింగ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో రైట్ టైం రైట్ ప్లేస్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారు’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
‘2024-25లో వంద బిలియన్ యూఎస్ డాలర్ల వ్యాపారం యూఏఈకి ఇండియాకు మధ్య జరిగింది. గత పదేళ్లగా 11 స్ధానం నుంచి నాల్గో స్ధానానికి ఇండియా చేరుకుంది.
2047కి ఇండియా ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుంది. ఆదిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. జనవరి 1 నాటికి మొదటి క్వాంటం కంప్యూటింగ్ ఏపీ నుండి పనిచేస్తుంది.
575 సర్వీసులు ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇస్తున్నాం ఆగష్టు 15 నాటికి ఈ సంఖ్య 100శాతానికి చేరుతుంది. మీరు ఇండియాలో పెట్టుబడులు పెడితే అన్ని అనుమతులు ఆన్లైన్ ద్వారా ఇస్తాం.
మీరు ఏ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు… మా హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. రాష్ట్రంలో పేదలను పైకి తెచ్చేందుకు పీ4ను తీసుకువచ్చాం.
వందశాతం పేదరిక నిర్మూలను మా లక్ష్యం… దుబాయ్, యూఏఈ ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా బాగా చేశారు. లులూకు ఎంతో డిమాండ్ ఉంది.
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాకముందు వచ్చినప్పుడు ఏపీకి రావాలని కోరాను’ అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
ఐదుసార్లు ఆయన్ను కోరాను ఏపీకి రావాలని అడిగాను. ఆయన నన్ను కొచ్చి వచ్చి షాపింగ్ మాల్ చూడాలని అడిగారు.
విశాఖపట్నంతో పాటు విజయవాడ, అమరావతిలో కూడా హైపర్ మాల్ పెట్టాలని అడుగుతున్నా. సంపద సృష్టిలో పెట్టుబడి దారుల పాత్ర ఎంతో ముఖ్యం.
గతంలో ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ మా నినాదం ఇప్పుడు స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్.ఏపీకి యూనిక్ అడ్వాంటేజ్‌లు ఉణ్నాయి.
1000 కిలో మీటర్లు తీరప్రాంతం ఉంది. ఉత్తర, దక్షణ భారత దేశాలను రైల్వే ద్వారా కలిపేది విజయవాడ. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు మన పోర్టుల ద్వారా కనెక్ట్ కావాలనుకుంటున్నారు.
ఏ ఇతర రాష్ట్రాలు పెట్టుబడుదారులకు ఇంత బలాన్ని ఇవ్వదు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, పోర్టులు ఉండటం అమ్మోనియా, గ్రీన్ ఎనర్జీలకు ఎంతో కీలకం అవుతాయి.
మొదటి హైడ్రోజన్ వ్యాలీ ఏపీ నుంచి వస్తుంది. పాపికొండలు, అరకు వ్యాలీ, లంబసింగి లాంటి ప్రాంతాలు మదనపల్లి, అనేక దేవాలయాలు రాష్ట్రంలో ఉన్నాయి.
త్వరలోనే విజయవాడ నుంచి మక్కా వరకూ నేరుగా విమానం పంపుతాం.కమర్షియల్, హస్పిటాలిటీ, టూరిజంలలో అనేక ఉపయోగాలు ఉన్నాయి. త్వరలోనే విశాఖలో గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటాసెంటర్ పెడుతోంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.