పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని వ్యాఖ్యానించారు. పుల్వామా ఘటన ద్వారా బీజేపీ ప్రభుత్వం లబ్ధిపొందాలని ప్రయత్నిస్తోందని దిగ్విజయ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బాలాకోట్‌లో భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల సంఖ్యను ప్రధాని మోదీ అధికారికంగా ఎందుకు విడుదల చేయలేదని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.
బీజేపీలో ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య ప్రకటిస్తున్నారని అన్నారు. మెరుపు దాడుల్లో 250 మంది ఉగ్రదాదులను అంతంచేశామని అమిత్ షా, 500 మంది అని యోగి ఆదిత్యానాథ్ చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ ఇంతవరకు కేంద్రం మాత్రం ప్రకటించలేదని అన్నారు. ఈమేరకు బుధవారం ఆయన హిందీలో వరుస ట్వీట్లు చేశారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఐఏఎఫ్ నిర్వహించిన వైమానిక దాడులపై కొన్ని విదేశీ మీడియా సంస్థలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇళ్ల మధ్యలోనే మద్యం దుకాణాలు.. నారా లోకేశ్ విమర్శలు