telugu navyamedia
రాజకీయ

ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్..ఆస్ప‌త్రిలో చికిత్స

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నై అల్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. మంగళవారం రోజున స్టాలిన్ కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో సెల్ప్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు.

ఈ విషయాన్ని స్టాలిన్ ట్విట్టర్ ‌ద్వారా వెల్లడించారు. ..పరీక్షలో కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత నేను ఒంటరిగా ఉన్నాను. మనల్ని మనం రక్షించుకోవడానికి ఫేస్ మాస్క్‌లు ధరించి, వ్యాక్సిన్‌లు వేసుకుందామ‌ని స్టాలిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే తాజాగా కోవిడ్ అనంతరం సైడ్ ఎఫెక్ట్స్ రావడంతోనే స్టాలిన్ కావేరి ఆసుపత్రిలో చేరారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కు కరోనా అనంతరం కొంత ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన కావేరి ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండటంతో స్టాలిన్ కు కావేరి ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అయితే స్టాలిన్ ఆరోగ్యం మెరుగుపడుతుందని కావేరి ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కోవిడ్ అనంతరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తాయని అధికారులు చెప్పారు.

Related posts