సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలనుకున్న ఫస్ట్ సింగ్ల్ సాంగ్ లీకైంది.
ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. కళావతి పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు.
ఆల్రెడీ రిలీజైన సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో నంబర్ వన్ పొజిషన్లో ట్రెండ్ అవుతోంది. ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఈ క్రమంలో కళావతి పాట కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సమయంలో ఈ పాట పూర్తిగా నెట్టింట్లో లీక్ కావడంతో సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తం నాలుగు నిమిషాల పాటను కొంత మంది యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటే… మరికొంత మంది వాట్సాప్ గ్రూప్స్‌లో సర్క్యులేట్ చేస్తున్నారు.
గతంలో కూడా ఈ సినిమా టీజర్ ఇలాగే లీక్ అయ్యిందని.. ఇప్పుడు కళావతి పాట కూడా లీక్ కావడంతో… చిత్రయూనిట్‌పై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదలవుతుంది.