నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “బింబిసార”. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో నుంచి “బింబిసార” నుంచి అప్డేట్ వచ్చింది. సినిమా టీజర్‌ను నవంబరు 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్.
ఇప్పటికే విడుదలైన కల్యాణ్‌రామ్ లుక్స్ ప్రేక్షకులకు ఎంతగానో ఆట్టుకుంటున్నాయి. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది.‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కథానాయిక.
క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. కళ్యాణ్ రామ్ తన కెరీర్లో తొలిసారి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నారు. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా కళ్యాణ్ రామ్ ఇందులో కనిపించనున్నారు.
నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తోన్న ఈ సినిమా.. డిసెంబరులో లేదా సంక్రాంతి తర్వాత థియేటర్లలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నందమూరి అభిమానులు మరో రెండ్రోజుల్లో విడుదల కానున్న సినిమా టీజర్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
He is Brutal.
He is Ruthless.
The Barbarian king is coming to mark his territory! #BimbisaraTeaser on Nov 29th 💥#Bimbisara@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @samyukthamenon @Warina_Hussain @actorbrahmaji @Music_Santhosh @ChirantannBhatt @anilpaduri pic.twitter.com/GKR45k4aPl— NTR Arts (@NTRArtsOfficial) November 27, 2021