హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. దనవంతుల పిల్లలు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న యువతిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి పెద్ద ఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఘనా దేశానికి చెందిన ఆ యువతి గత కొద్ది నెలలుగా సిటీలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లోని వ్యాపారవేత్తల పిల్లలకు ఆ యువతి డ్రగ్స్ అమ్మినట్లు విచారణలో తేలింది. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం డ్రగ్స్ కొనుగోలు చేసిన వారందిరికీ త్వరలో నోటీసులు ఇస్తామని అధికారులు చెప్పారు. సిటీకి డ్రగ్స్ ఎలా తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడా విక్రయిస్తున్నారనే దాని పై వివరాలు తెలియాల్సి ఉంది.
previous post