అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా నాగార్జున అభిమానులకి వరుస గిఫ్ట్స్ ఇస్తున్నారు మేకర్స్. నాగార్జున నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘బంగార్రాజు’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది.
నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆల్రెడీ ప్రవీణ్ సత్తారు తో ఫిల్మ్ “ది ఘోస్ట్” ఫస్ట్ లుక్ కి భారీ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుండగా దానికి కంప్లీట్ డిఫరెంట్ గా ..నాగ్ చేస్తున్న మరో ఎంటర్టైనింగ్ ప్రాజెక్ట్ “బంగార్రాజు” నుంచి కూడా సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అప్డేట్ ని అక్కినేని యువ హీరో నాగ చైతన్య లాంచ్ చేసాడు.
నాగార్జున హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అయితే.. ఈ సినిమానే సీక్వెల్ లో భాగంగా బంగార్రాజు చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
నాగ్ కు జోడీ గా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్ తో కలిసి అన్నపూర్ణ స్టూడి యోస్ పతాకం పై నాగార్జున నిర్మిస్తున్నారు. భావో ద్వేగాలు, కమర్షికల్ మేళవింపుగా… అంచనాలకు తగ్గట్టుగానే.. రూపొం దుతున్న బంగార్రాజు చిత్ర ఫస్ట్ లుక్ .. కొద్ది సేపటి క్రితమే చైతన్య రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పై డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ రాసుకొచ్చారు.
ఇందు లో నాగార్జున మాత్రమే కనిపి స్తున్నారు. స్వర్గం నుంచి దిగుతున్నట్లుగా నాగ్ కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ లుక్ ను చూసిన అక్కినేని అభిమానుల్లో జోష్ పెరిగింది.