telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భార్యకు సేవలు చేస్తున్న మోహన్ బాబు

Mohan-Babu

సినీ ప్రముఖులు కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. విరామ సమయంలో తాము చేస్తున్న పనుల గురించి కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ ఓ ఆసక్తికర వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. మోహన్‌బాబు తన భార్య నిర్మలా దేవికి సపర్యలు చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. సోఫాలో పడుకున్న నిర్మలా దేవికి మోహన్ బాబు నాప్‌కిన్‌తో గాలి విసురుతున్నారు. దీన్ని మనోజ్ వీడియో తీసి తన ట్విట్టర్‌ ఖాతాలో పెట్టాడు. ప్రతి వ్యక్తి ఇదే తరహాలో భార్యకు సపర్యలు చేయాలని సూచించాడు. 

Related posts