telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలి: సీఎం జగన్‌కు కన్నా లేఖ

Kanna laxminarayana

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్‌ తీసుకున్న చర్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభినందించారు. వైరసును అడ్డుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పందించారు. నిరుపేదలు, రోజుకూలీలు ఇబ్బంది పడకుండా వారికి రేషన్‌, ఇతర సరుకుల ఉచిత పంపిణీ వెంటనే చేపట్టాలని ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

కరోనా వ్యాప్తిలో కీలకపాత్రపోషిస్తున్న మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను తక్షణం మూసివేయాలని కోరారు. కరోనాపై సర్వేకు వలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వైరస్‌ అధికంగా ఉండే వృద్ధుల నుంచి వారికి ఎదురయ్యే ప్రమాదాన్ని గమనించాలని కోరారు. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులు పంపిణీ చేయాలని పేర్కొన్నారు.

Related posts