telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆకాశం నీ హద్దురా” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

Akashame-ni-Haddura

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 30న విడుదల కానుందని సూర్య ప్రకటించాడు. లాక్ డౌన్ మూలాన థియేటర్స్ మూతపడడంతో ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు భారీ ధరకు కొనుగోలు చేసి వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ రిలీజ్ రెడీ చేస్తున్నారు. అయితే ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం టీజర్ వచ్చే వారంలో చిత్ర యూనిట్ విడుదల చేయనున్నారట. అందుకు సంబంధించి పనులు పూర్తయ్యాక డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా భారీ ఎత్తున ఏకంగా 200ల దేశాల్లో విడుదల కానుంది. జీవీ ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. అన్నట్టు ఈ చిత్రంలో సూర్య తెలుగు వెర్షన్ డబ్బింగ్ కు టాలెంటెడ్ హీరో సత్యదేవ్ అందిస్తున్నారు.

Related posts