మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ లో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటుంది . తెలుగు సినిమా రంగం ఇప్పుడు రెండుగా చీలిపోయిందనే చెప్పాలి . మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీదా ఆధిపత్యంకోసం జరుగుతున్న ఈ ఎన్నికలను రెండు గ్రూపులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ అధ్యక్షుడు, కార్యదర్శిగా పనిచేసిన శివాజీరాజా , నరేష్ ఇప్పుడు రెండు గ్రూపులయ్యారు .
ఇద్దరు అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్నారు . రాజేంద్ర ప్రసాద్ తరువాత అధ్యక్ష పదవి కోసం శివాజీరాజా పోటీపడినప్పుడు ఆ ఇద్దరి మధ్య ఎన్నికలు జరుగుతాయని అనుకున్నారు . రెండవసారి కూడా రాజేంద్ర ప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ అధ్యక్ష పదవిలో వుండాలనుకున్నాడు . అప్పుడు శివాజీరాజా నేను పోటీ చేస్తాను అని చెప్పాడు .
ఇద్దరిమధ్య పోటీ తప్పదు అని అందరు భావించారు . అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ లో ఇలాంటి పోటీ అనారోగ్యంగా మారుతుందని సీనియర్ నటులంతా రాజేంద్ర ప్రసాద్ కు నచ్చ చెప్పారు . అప్పుడు రాజేంద్ర ప్రసాద్ పోటీ నుంచి తప్పుకున్నాడు . శివాజీరాజా అధ్యక్షుడు అయ్యాడు . కార్యదర్శిగా నరేష్ ఎంపికయ్యాడు . ఇప్పుడు శివాజీరాజా ఒక టర్మ్ చేసిన తరువాత రెండవ టర్మ్ కూడా చేయాలనుకుంటున్నాడు . ఇదే సందర్భంలో నరేష్ కూడా అధ్యక్ష పదవి కోరుకుంటున్నాడు .
గతంలో రాజేంద్ర ప్రసాద్ హుందాగా పోటీ నుంచి తప్పుకున్నాడు . అదే పని శివాజీ రాజా ఇప్పుడు చెయ్యాలి అని నరేష్ వాదిస్తున్నాడు .
మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ సిల్వర్ జూబిలీ సంవత్సరం కాబట్టి ఇంకా చెయ్యాల్చిన పనులు మిగిలి పోయాయి కాబట్టి నేను మళ్ళీ అధ్యక్ష పదవిలో ఉండాలనుకుంటున్నా అని శివాజీ చెబుతున్నాడు . శివాజీరాజా , నరేష్ మధ్య చాలాకాలంగా విభేదాలున్నాయి . మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ సిల్వర్ జూబిలీ సందర్భంగా విరాళాలు వసూలు చెయ్యడానికి శివాజీరాజా, శ్రీకాంత్ చిరంజీవితో కలసి అమెరికా వెళ్లారు . అక్కడ ఆశించిన విధంగా డబ్బు రాలేదు .
వచ్చిన డబ్బు కూడా స్వలాభం కోసం దుర్వినియోగం చేశారని అప్పట్లో నరేష్ ఆరోపించాడు . నరేష్ అమెరికా వెళ్ళలేదు . ఇదే విసయంలో ఈ ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది . ఇద్దరు రోడ్డెక్కారు , ఒకరిపై మరొకరు బురద చల్లుకున్నారు . ఆ పంచాయితి చిరంజీవి దగ్గరకు వెళ్ళింది . ఇద్దరికీ నచ్చచెప్పాడు . తాత్కాలికంగా సర్దుకున్నారు . ఆ తరువాత అనేక విషయాల్లో ఇద్దరు విభేదిస్తూనే వున్నారు . ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది ఈ రెండు గ్రూపుల పంచాయితీ మళ్ళీ చిరంజీవి దగ్గరకు వెళ్లాయి . చిరంజీవి లౌక్యుడు కాబట్టి ఇద్దరికీ తన ఆశీస్సులు వుంటాయని చెప్పాడు .
ఎవరు తగ్గడం లేదు , రాజీపడటము లేదు . ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది . శివాజీరాజా గ్రూప్ లో కృష్ణారెడ్డి , శ్రీకాంత్ , పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులున్నారు . నరేష్ గ్రూప్ లో డాక్టర్ రాజశేఖర్ , జీవితా రాజశేఖర్ మొదలైన వారు వున్నారు . ఈ నెల 10 వ తేదీ ఆదివారం ఎన్నికలకు రెండు గ్రూపులు సమాయత్తమవుతున్నాయి .
మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ లో ఆధిపత్యం కోసం ప్రాకులాట ప్రారంభమయ్యింది . రాజకీయాలకు ఇది అడ్డాగా మారుతుందా > అన్న అనుమానం కూడా కలుగుతుంది . మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ వెంక రాజకీయ పార్టీల అండ కూడా ఉండేవే విషయాన్ని కొట్టిపారేయలేం !
“మా ” గ్లామర్ ప్రపంచం కాబట్టి అందరి చూపు దీని మీదనే ఉంటుంది . దీని మీద పట్టు కోసం రాజకీయ పార్టీలో ప్రయత్నం చేస్తుంటాయి . శివాజీరాజా బలం ఏమిటో , నరేష్ బలగం ఎంతో 10వ తేదీన తెలుస్తుంది .
– భగీరథ
నాకు మందు అలవాటు ఉంది… కానీ… : శ్రీముఖి