telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ క్రికెటర్ కు వీరాభిమానిని అంటున్న పూజాహెగ్డే

Pooja

అల్లు అర్జున్ సరసన ‘డీజే’, ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’, మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో, తాజాగా బన్ని సరసన అలవైకంఠపురములో నటించి వరుస హిట్లతో ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తోంది పూజాహెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఇక లాక్ డౌన్ లో తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పూజ స్పందిస్తూ తనకు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అంటే చాలా ఇష్టమట. ఈ తరంలో ఎంత మంది గొప్ప ఆటగాళ్లున్నా వారెవరూ ద్రవిడ్‌కు సాటిరారని పూజ పేర్కొంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పూజ స్పందించింది. `నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం స్కోర్ తెలుసుకోవడానికైనా ప్రయత్నిస్తా. నేను ద్రవిడ్‌కు వీరాభిమానిని. ఈ తరంలో ధోని, కేఎల్ రాహుల్ ఆటతీరును ఇష్టపడతా. అయితే ఈ తరంలో ఎంత మంది ప్రతిభావంతులు ఉన్నప్పటికీ వారెవరూ ద్రవిడ్‌కు సాటి రారు. ద్రవిడ్ చాలా కూల్‌గా, క్లాసిక్‌గా ఆడతాడ`ని పూజ పేర్కొంది.

Related posts