telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

అవునా.. పెత్తనమంతా సజ్జలదేనా?

ఏపీ సీఎం ఎవ‌రు అన అడిగితే, చిన్న పిల్లలు కూడా ట‌క్కున వైఎస్ జ‌గ‌న్‌మెహ‌న్‌రెడ్డి అని చెబుతారు. అయితే, అదే ప్ర‌శ్నరాష్ట్ర‌ ప్ర‌భుత్వ అధికారులను అడిగితే మ‌న‌కు స‌మాధానంగా మ‌రో ప్ర‌శ్న ఎదుర‌వుతుంది. సీఎం పేరు చెప్ప‌మంటారా ..? యాక్టింగ్ సీఎం పేరు చెప్ప‌మంటారా? అని. ఔను ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అని భావిస్తే ప‌ప్పులో కాలేసిన‌ట్లు. ఎందుకంటే రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ కంటే ప‌వ‌ర్ ఫుల్ యాక్టింగ్ సీఎం స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డేన‌ని టాప్ ఆఫీస‌ర్స్ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వ‌ర‌కు ఓపెన్ టాక్.

రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించినప్ప‌టి నుంచి ఆయ‌న‌కు ప్ర‌ధాన రాజ‌కీయ స‌ల‌హాదారుడిగా స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సిల్వ‌ర్ జూబ్లీ పెళ్లి రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకోవ‌డానికి సీఎం జ‌గ‌న్ కుటుంబ‌స‌మేతంగా ఐదు రోజుల సిమ్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. సిమ్లా టూర్ నుంచి ముఖ్య‌మంత్రి తిరిగి రాష్ట్రానికి వ‌చ్చే వ‌ర‌కు యాక్టింగ్ సీఎంగా స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి వ్య‌వ‌హ‌రిస్తార‌ని, ఆయ‌న రాష్ట్రానికి అప్ర‌క‌టిత ముఖ్య‌మంత్రి అని రూమ‌ర్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సిమ్లా ప‌ర్య‌ట‌న ముగించుకుని రాష్ట్రానికి ఆగ‌స్ట్ 31న తిరిగి రానునున్నారు. ఈ ప‌రిస్థితుల్లో స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఏపీకి మ‌ధ్యంత‌ర ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే డిబేట్స్ వైఎస్సార్‌సీపీ నేత‌ల్లో వైర‌ల్‌గా మారింది. ముఖ్య‌మంత్రి కంటే ఎక్కువ అధికారాన్ని స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి చెలాయిస్తార‌నే మాట‌ల‌ను క‌నీసం జ‌గ‌న్ రాష్ట్రంలో లేన‌ప్పుడు కూడా వైఎస్సార్‌సీపీ నేత‌లు బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌లేక పోతున్నారు.

మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్ప‌ప్పుడు కూడా కుటుంబంతో క‌లిసి ఫ్యామిలీ టూర్ల‌కు వెళ్లారు. అయితే, చంద్ర‌బాబునాయుడు ఎప్పుడూ యాక్టింగ్ సీఎంల‌ను ప్రోత్స‌హించ‌లేదు. ఆయ‌న స్థానంలో మ‌రొక‌ర్ని రానివ్వ‌లేదు. ఫోన్‌, వీడియో కాన్ఫ‌రెన్స్‌ల ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఇత‌ర అధికారుల‌తో చంద్ర‌బాబు నాయుడు ట‌చ్ లోనే ఉండేవారు. ఆ కార‌ణంగా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో లేక‌పోయినా, విదేశాల‌కు టూర్ల‌కు వెళ్లినా యాక్టింగ్ సీఎం అనే మాట విన‌బ‌డ‌లేదు. మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వైఖ‌రికి పూర్తి భిన్న‌మైన మ‌న‌స్త‌త్వం ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెద్దిది. ఆయ‌న వ్య‌క్తిగ‌త టూర్‌కు వెళ్లిన సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌కు పూర్తిగా దూరంగా ఉంటారు. ప్ర‌స్తుతం సిమ్లా టూర్ విష‌యంలో కావ‌చ్చు అంతకు ముందు వెళ్లిన జెరూస‌లెం టూర్ కావ‌చ్చు.

ముఖ్య‌మంత్రి జెరూస‌లెం వెళ్లిన‌ప్పుడు రాష్ట్ర పాల‌నావ్య‌వ‌హారాల‌ను వైవీ సుబ్బారెడ్డి, రాజ‌మోహ‌న్‌రెడ్డిల‌కు అప్ప‌గించారు. సీఎం జ‌గ‌న్ తీసుకునే అతి త‌క్కువ సెల‌వుల‌ను వైఎస్సార్ సీపీ నేత‌లు కూడా స‌మ‌ర్థిస్తున్నారు. ఆయ‌న రాష్ట్ర బాధ్య‌త‌ల‌ను న‌మ్మ‌క‌స్థుల‌కు అప్ప‌గించి వెళ్ల‌డాన్ని కూడా వారు త‌ప్పు బ‌ట్ట‌డం లేదు. అయితే, జ‌గ‌న్ తిరిగి వ‌చ్చే వ‌ర‌కు ఆయ‌న కుర్చీ బాధ్య‌త‌లు మోస్తోన్న స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఏవిధంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే ఆస‌క్తి సొంత పార్టీ నేత‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌జ్జ‌ల ఎలాంటి అధికారిక ఆదేశాల‌ను అధికారుల‌కు జారీ చేయలేదు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్యానాథ్ దాస్ అధికారిక కార్య‌క్ర‌మాల‌న్నీ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే, ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల్లో స‌జ్జ‌ల క‌చ్చితంగా వేలు పెడ‌తాడ‌ని వైఎస్సార్ సీపీ నేత‌లు భావిస్తున్నారు. జ‌గ‌న్ కుర్చీలో స‌జ్జ‌ల వ్య‌వ‌హారాలు ఏవిధంగా ముందుకెళుతుందోన‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నారు.

Related posts