ఉదయం జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామిని మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ చేరుకున్న హరీష్‌రావు…తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సరానికి గానూ తెలంగాణ బడ్జెట్ విలువ రూ. 2,30,825.96 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు కాగా.. ఆర్థిక లోటు అంచనా రూ. 45, 509.60 కోట్లు, మూలధన వ్యయం రూ. 29.046.77 కోట్లు అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు హరీశ్‌రావు. ఏడేళ్ల తెలంగాణ తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతిలో అధిగమించిందని..ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని.. నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. సమస్యలు, సవాళ్లు అధిగమిస్తూ ప్రగతి పథాన పయనిస్తున్నామని..కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. రాష్ర్టంలో కరోనా తీవ్ర ప్రభావం చూపిందని హరీష్‌రావు పేర్కొన్నారు.
బడ్జెట్ పూర్తి వివరాలు….
-రాష్ర్ట బడ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు
-రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు
-ఆర్థిక లోటు అంచనా రూ. 45,509.60 కోట్లు
-పెట్టుబడి వ్యయం రూ. 29.046.77 కోట్లు
-వెయ్యి కోట్ల నిధులతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్
-ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు
-ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు
-నేతన్నల సంక్షమం కోసం రూ. 338 కోట్లు
-బీసీ కార్పొరేషన్, అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు
-మొత్తంగా బీసీ సంక్షేమ శాఖకు రూ. 5,522 కోట్లు
-పల్లెప్రగతి కింద ఇప్పటి వరకు గ్రామపంచాయతీలకు రూ. 5,761 కోట్ల నిధులు విడుదల
-తొలిసారిగా రాష్ర్ట ప్రభుత్వ బడ్జెట్ నుంచి మండల, జిల్లా పరిషత్‌లకు రూ. 500 కోట్ల నిధులు
-ఇందులో జిల్లా పరిషత్‌లకు రూ. 252 కోట్లు, మండల పరిషత్‌లకు రూ. 248 కోట్లు
-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,271 కోట్లు
-ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం రూ. 5 కోట్లు
-వెయ్యి కోట్ల నిధులతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్
-వ్యవసాయ రంగానికి రూ. 25 వేల కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1500 కోట్లు
-రైతుబంధు పథకానికి రూ. 14,800 కోట్లు
-రైతు రుణమాఫీకి రూ. 5,225 కోట్లు
-రైతు బీమా పథకానికి రూ. 1200 కోట్లకు పెంపు
-పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ. 1,730 కోట్లు
-సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు
-సమగ్ర భూ సర్వే కోసం రూ. 400 కోట్లు
-ఆసరా పెన్షన్ల కోసం రూ. 11,728 కోట్లు
-కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకాలకు రూ. 2,750 కోట్లు
విద్యుత్ శాఖకు 11,046 కోట్లు
పరిశ్రమల శాఖకు 3, 077 కోట్లు
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సుంకిషాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకు 725 కోట్లు
మూసీ సుందరికారణకు 200 కోట్లు
మెట్రోరైలు ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్లు