అమరావతి రాజధాని భవనాల నిర్మాణంపై మరో ముందడుగు వేసింది జగన్ ప్రభుత్వం. అసంపూర్తి భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రూ. 3 వేల కోట్ల మేర ఎమ్మార్డీఏకు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన ఏపీ కెబినెట్… అసంపూర్తి భవనాల నిర్మాణం కొనసాగింపుపై గతంలోనే సీఎస్ నేతృత్వంలోని తొమ్మిది సభ్యుల కమిటీ భేటీ అయింది. అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణానికి రూ. 2154 కోట్లు నిధుల అవసరమని ప్రాథమిక అంచనా వేసింది సీఎస్ కమిటీ. కాంట్రాక్టర్ల చెల్లింపుల నిమిత్తం సుమారుగా మరో రూ. 300 కోట్లు అవసరమని భావించిన కమిటీ… కరకట్ట రోడ్డు, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధుల సమీకరణకు గతంలోనే సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 70 శాతానికి పైగా పూర్తైన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గతంలోనే అభిప్రాయపడింది కమిటీ. కమిటీ సూచనల మేరకు బ్యాంక్ గ్యారెంటీకి కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది.
అలా హరీష్ శంకర్ హిట్ కొడితే ఇండస్ట్రీ వదిలేస్తా… బండ్ల గణేష్ ఫైర్