ఏపీలో పంచాయితీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నాయకుల విమర్శల దాడి పెరుగుతూనే ఉంది. అయితే తాజాగా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… 90 శాతం సర్పంచ్ స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతు దారుల విజయం ఖాయం అని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ యోచన సరికాదన్న ఆయన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ని ప్రైవేటీకరించొద్దని ప్రధాని కి సీఎం జగన్ లేఖ రాశారని పేర్కొన్నారు. క్యాప్టివ్ మైనింగ్ కేటాయించి అప్పులు లేకుండా చేయాలని 2015లోనే కేంద్రం ప్రతిపాదనలు చేసిందని అన్నారు. టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఆనాడు నిర్ణయించిందని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు చంద్రబాబు బాధ్యత వహించాలని అన్నారు. చిత్తూరు, గుంటూరు ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ నిర్ణయం అనాలోచిత చర్య అని పేర్కొన్న ఆయన మంత్రి పెద్దిరెడ్డి ని గృహనిర్భందం చేయాలనుకోవడం తప్పని అన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ లకు అతీతం అని, టీడీపీ మ్యానిఫెస్టోపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మరే ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ పై అనర్హత వేటు వేయాలన్న ఆయన ఎస్ఈసీ నిర్ణయాలే అంతిమం కాదన్న విషయం హైకోర్టు తీర్పు తో తేలిపోయిందని అన్నారు. చుడాలిమరి ఏం జరుగుతుంది అనేది.