ఏపీలో రాజకీయాలు వేడివేడిగా నడుస్తున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీలో పెద్ద రచ్చ జరుగుతుంటే… తాజాగా ఏపీ డీజీపీ మరో బాంబు పేల్చాడు. విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ, బీజేపీ నాయకులున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. దీనిపై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. “విగ్రహాలు ధ్వంసం చేసింది దొంగలు, పిచ్చోళ్లని నిన్న చెప్పిన డిజిపి దొరా, నేడు రాజకీయ కుట్ర కోణంవైపు మీ మాటెందుకు తిరిగింది! రాత్రికి తాడేపల్లి కొంపలో సీఎం జగన్ మార్క్ భోగి పళ్లేమైనా మీకు పోశారా? మీరు విడుదల చేసిన జాబితాలో కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చేసిన వైసీపీ నేత దామోదర్ రెడ్డి పేరు లేదేం? ఓంకార క్షేత్రంలో అర్చకులను చితక్కొట్టిన వైసీపీ నేత ప్రతాపరెడ్డి పేరు ప్రస్తావించలేదెందుకు? ఆంజనేయుడు చేయి విరిగితే రక్తమొస్తుందా? రాముడి తల తెగితే విగ్రహం ప్రాణం పోతుందా? అని హిందుత్వంపైనే దాడికి దిగిన బూతుల మంత్రి నానిపై కేసు ఎందుకు పెట్టలేదు? హిందుత్వం మనుగడనే ప్రశ్నించేలా దాడులు జరుగుతుంటే నిందితులను పట్టుకోవడం చేతకాక చేవచచ్చిన మీపై ముందు కేసుపెట్టాలి. తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు కోర్టులు మీపై సుమోటోగా కేసు నమోదు చేయాలి.” అంటూ లోకేష్ మండిపడ్డారు.
జగన్ ఢిల్లీ పర్యటనపై యనమల విమర్శలు