*విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్
*76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్
ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు. వాహనంలో సీఎంతో పాటు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారు.
స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో 12 కంటిజెంట్స్ పరేడ్ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 10 బ్యాండ్స్ ప్రదర్శన చేస్తున్నారు. మరోవైపు ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను అధికారులు ప్రదర్శిస్తున్నారు.
కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్విభూషన్ హరిచందన్ తేనేటు విందు ఇవ్వనున్నారు. ఈ ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు
జగన్ గారు తెలుగులోనే కాదు ఇంగ్లీష్, లెక్కల్లోనూ వీకే: లోకేశ్