కొత్త వాహన చట్టంతో ఇప్పటికే బోలెడు చిక్కులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇష్టానుసారంగా రోడ్డుపైకి వచ్చేసిన వాహనదారులు .. పొరపాటున సరైన పత్రాలు లేకుండా కనపడితే వెలకివేలు జరిమానా విధిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, కాస్త తేడా జరిగింది, అది నిజంగా తేడానే.. మరి. కారులో వెళ్తూ హెల్మెట్ ధరించలేదని ఓ వ్యక్తికి రూ.500 చలానా జారీచేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది.
నగరానికి చెందిన వ్యాపారి అనీశ్ నరూలా కారులో ప్రయాణిస్తూ హెల్మెట్ పెట్టుకోలేదంటూ ట్రాఫిక్ పోలీసులు ఆయనకు రూ.500 చలానా పంపారు. ఇది చూసి విస్తుపోయిన ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు పొరపాటు జరిగిందని, చలానా జారీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


ప్రాజెక్టు నిర్మాణాలను తప్పుబట్టిన కోదండరాం