telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో కొత్త టెన్షన్..కొలుకునే లోపే మరో పిడుగు !

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,693 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక 33 మంది కరోనాతో మృతి చెందారు.  ఈ నేపథ్యంలో తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. తెలంగాణలో మ్యూకర్ మైకోసిస్‌ (బ్లాక్ ఫంగస్) తో ఓ వ్యక్తి మరణించారు. గాంధీ ఆస్పత్రిలో మరో ముగ్గురు కరోనా రోగుల్లోనూ దీనిని గుర్తించారు. మరి కొందరు ఈ తరహా లక్షణాలతో వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలలో చేరుతున్నారు. నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ తో వైద్యం పొందుతున్న నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. సంబంధిత వైద్య వర్గాలు మాత్రం నిర్ధారించలేదు. ఇటీవలే ప్రైవేటు ఆస్పత్రిలలో సుదీర్ఘ వైద్యం తీసుకున్న ముగ్గురు గాంధీలో చేరారు. వైద్యులు వారిలో బ్లాక్ ఫంగస్ గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా, ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉంది. 

Related posts