telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ సీనియర్ నటికి కరోనా

Zarina

కరోనా విలయతాండవం చేస్తుండడంతో సమాక్యులతో పాటు సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది కరోనా బారిన పది కోలుకున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ సీనియర్‌ నటి జరీనా వహాబ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. శ్వాస సమస్య, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న జరీనా వహాబ్‌లో ఆక్సిజన్‌ లెవల్స్ తక్కువగా ఉండటంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం జరీనా క్షేమంగానే ఉన్నారని, స్పందిస్తున్నారని డాక్టర్స్‌ తెలిపారు. ఈమె ప్రముఖ నటుడు సూరజ్ పంచోలి తల్లి. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జరీనా వహాబ్‌ నటించారు. ప్రస్తుతం రానా దగ్గుబాటి, సాయిపల్లవి కాంబినేషన్‌లో వేణు ఊడుగుల రూపొందిస్తోన్న ‘విరాటపర్వం’ చిత్రంలో ఈమె ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Related posts