*ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది..
*దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి
*హైదరాబాద్ నెల్లూరు ,చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ , పంజాబ్ ,హర్యానా,
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుపెంచింది. దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి .ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది.
తాజాగా హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి..మొత్తం 25 బృందాలుగా ఏర్పడిన అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ కు చెందిన లిక్కర్ వ్యాపారి రామచంద్ర పిళ్లై నివాసంలో ఇటీవలే సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో మరికొన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ కేసులో రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ సికింద్రాబాద్ లోని నవకేతన్ భవన్ లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ అడ్రాస్ ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
అయితే అక్కడ బ్యూటీ పార్లర్ ఉందని, దానికి డైరెక్టర్ గా అభిషేక్ రావు ఉన్నారని కూడా ఈడీ గుర్తించింది. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ ఈమెయిల్ అడ్రస్ సైతం ఒకటేనని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.ఈడీ అధికారులు మరింత సమాచారం కోసం ఈ సోదాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.